బీజేపీ చీఫ్ Vs కాంగ్రెస్ చీఫ్..

by Harish |
బీజేపీ చీఫ్ Vs కాంగ్రెస్ చీఫ్..
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ విమర్శనాస్త్రాలు కొనసాగిస్తోంది. ఆ పార్టీ జాతీయ చీఫ్ జేపీ నడ్డా కాంగ్రెస్ మాజీ చీఫ్‌పై విరుచుకపడ్డారు. రాహుల్ గాంధీ భారత్‌కు వ్యతిరేకంగా పనిచేసే టూల్ కిట్‌లో శాశ్వత భాగమయ్యారని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. రాహుల్ దేశ వ్యతిరేక భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, వామపక్ష ఉదారవాదులు దేశానికి వ్యతిరేకంగా విదేశీ శక్తులు ప్రమేయం ఉన్న కుట్రలో భాగంగా మారారని ఆరోపించారు.

కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్ భాష మాట్లాడుతున్నారని నడ్డా మండిపడ్డారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకోవాలన్న రాహుల్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్‌ను వ్యుహాత్మకంగా, ఆర్థికంగా దెబ్బతీసేదుకు కాంగ్రెస్ విదేశీ మోసగాళ్లతో చేతులు కలిపిందని ఆరోపించారు. స్వతంత్ర భారత దేశంలో ఏ భారత నాయకుడు కూడా ఇలాంటివి చేయలేదని విమర్శించారు. ఇది చాలా తీవ్రమైన అంశమని చెప్పారు.

బీజేపీ నేతలే దేశ వ్యతిరేకులు

బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే కౌంటర్ ఎటాక్ చేశారు. బీజేపీ నేతలే దేశ వ్యతిరేకులని, స్వాతంత్ర ఉద్యమంలో వారు ఎప్పుడు భాగం కాలేదని విమర్శించారు. బ్రిటిష్ వారి కోసం పని చేశారని మండిపడ్డారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పక్కదోవ పట్టించేందుకు ఈ అంశాన్ని హైలెట్ చేస్తున్నారని అన్నారు.

‘జేపీ నడ్డా వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఇందులో క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు. పార్లమెంట్ లో మేము ప్రభుత్వానికి తగిన బదులిస్తాం. రాహుల్ గాంధీనే స్వయంగా సమాధానం చెప్తారు. పార్లమెంట్ లో మాట్లాడేందుకు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు’ అని అన్నారు. ప్రధాని మోడీనే పలు సందర్భాల్లో భారత్‌ను అవమానించారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed