- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rahul Gandhi: ఎల్ఐసీ ఏజెంట్ల ప్రతినిధులతో రాహుల్ గాంధీ భేటీ

దిశ, డైనమిక్ బ్యూరో: పేదలకు తక్కువ ధరలకే ఇన్సూరెన్స్ (Insurance) అందించే అంశాన్ని తాను లోక్ సభలో లేవనెత్తుతానని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చెప్పారు. ఇవాళ పార్లమెంట్ హస్ కాంప్లెక్స్ లోని తన కార్యాలయంలో ఎల్ఐసీ ఏజెంట్ల బృందాన్ని (LIC Agents Delegation Team) రాహుల్ గాంధీ కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలను విన్న రాహుల్ గాంధీ ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించారు. ఏజెంట్ల స్థానాన్ని బలహీనపరిచే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ), ఎల్ఐసీ నిబంధనలలో ఇటీవలి మార్పుల గురించి ఎజెంట్ల బృందం ఆందోళన వ్యక్తం చేసిందని తెలిపారు. సామాజిక భద్రత లేని పేదలకు సరసమైన బీమాను అందించడమే లక్ష్యంగా 1956 లో ఎల్ ఐసీని స్థాపించారు. ఎల్ఐసీ లక్ష్యాలను కాపాడే విషయంలో ఈ సమస్యను తాను లోక్ సభలో ప్రస్తావిస్తానని భరోసా ఇచ్చారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు చట్టపరమైన హక్కులు, వారి పనులకు సంబంధించిన సమస్యలపై వారి ప్రతినిధుల బృందం సభ్యులతో రాహుల్ గాంధీ చర్చించారు.
Read More..