- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rahul Gandhi: యూపీలోని సుల్తాన్‌పూర్‌లో లోకో పైలట్‌లతో రాహుల్ గాంధీ భేటీ
దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో లోకో పైలట్‌లతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర హోమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 2018లో రాహుల్‌పై పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ నేపథ్యంలో విచారణకు శుక్రవారం ఉదయం సుల్తన్‌పూర్ కోర్టులో స్వయంగా హాజరయ్యారు. కోర్టు విచారణ పూర్తయిన తర్వాత ఎన్ఆర్ ఎంప్లాయీస్ యూనియన్ సుల్తాన్‌పూర్ ఆధ్వర్యంలోని లోకో పైలట్ల ప్రతినిధి బృందాన్ని కలిశారు. ఈ సందర్భంగా వారు తమ డిమాండ్లను వివరిస్తూ ప్రభుత్వం తరపున సమస్యలకు పరిష్కారాలను అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించడం, ఖాళీగా ఉన్న పోస్ట్‌లకు రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ నిర్వహించడం, సుల్తాన్‌పూర్ లాబీలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యలను పరిష్కరించేలా చూడాలని రాహుల్‌ను కోరారు. ఢిల్లీలో రాహుల్ తమ సమస్యలను లేవనెత్తిన తర్వాత, ప్రభుత్వం అనేక దిద్దుబాటు చర్యలు తీసుకుందని లోకో పైలట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత మాట్లాడిన రాహుల్ గాంధీ, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రధాని మోడీని విమర్శిస్తూ, బీజేపీ హయాంలో లోకో పైలట్ల జీవితాలు పట్టాలు తప్పాయని, రాహుల్ పేర్కొన్నారు.