31న ఇండియా కూటమి సభ.. అనుమతి మంజూరు

by Hajipasha |
31న ఇండియా కూటమి సభ.. అనుమతి మంజూరు
X

దిశ, నేషనల్ బ్యూరో: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సంఘీభావంగా ఆదివారం (మార్చి 31న) ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌‌ వేదికగా ఇండియా కూటమి భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దీనికి విపక్ష కూటమికి చెందిన అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే తదితరులు హాజరుకానున్నారు. ఈ సభకు ఢిల్లీ పోలీసు విభాగం, కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అనుమతులు మంజూరు చేశాయి. ఆదివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే ఈ ప్రోగ్రాంకు పెద్దఎత్తున ప్రజలను సమీకరించడంపై ఢిల్లీలోని కాంగ్రెస్, ఆప్ అగ్రనేతలు ఫోకస్ పెట్టారు. దీనికి హాజరవుతామని ప్రకటించిన నేతల జాబితాలో సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (ఆప్), జార్ఖండ్ సీఎం చంపై సోరెన్(జేఎంఎం), హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్, ఆర్జేడీ అగ్ర నేత తేజస్వి యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరి, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రెయిన్, డీఎంకే నేత డి.రాజా ఉన్నారు. ఇక ఆప్ తరఫున అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, ఇతర నేతలు అతిషి, గోపాల్ రాయ్, సౌరభ్ భరద్వాజ్ ఈ సభలో కీలకంగా వ్యవహరించనున్నారు.

Advertisement

Next Story