- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆధునిక భారత్‌కు రాహుల్ మహత్ముడు: కాంగ్రెస్ ఎమ్మెల్యే అమితేష్ శుక్లా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎమ్మెల్యే అమితేష్ శుక్లా రాహుల్ గాంధీపై పొగడ్తల వర్షం కురిపించారు. రాహుల్ ఆధునిక భారత్‌కు మహత్మ గాంధీ లాంటి వ్యక్తి అని అన్నారు. ఆయనకు మహాత్ముడితో చాలా పోలికలు ఉన్నాయని చెప్పారు. మహాత్ముడి దండియాత్ర వలె రాహుల్ భారత్ జోడో యాత్ర చేశారని తెలిపారు. రాహుల్ గాంధీని జాతిపితగా అభివర్ణించారు. తాను బాధ్యతాయుతంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పారు. తాను కూడా స్వాతంత్య్ర పోరాట యోధుల కుటుంబానికి చెందిన వ్యక్తినని అన్నారు.
మహాత్ముడు కావాలనుకుంటే భారత ప్రధాని అయ్యేవారని కానీ వద్దనుకున్నట్లు తెలిపారు. రాహుల్‌కు కూడా 2004లో ఆ అవకాశం వచ్చిన వదులుకున్నారని చెప్పారు. చత్తీస్ గఢ్‌కు చెందిన ఎమ్మెల్యే 2018లో అత్యధిక ఓట్లతో గెలిచిన వ్యక్తిగా నిలిచారు. కాగా, శుక్ల వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సంతోష్ పాండే కౌంటర్ ఇచ్చారు. చత్తీస్‌గఢ్ కాంగ్రెస్ మానసికంగా, మేధో పరంగా దివాళా తీసిందని అన్నారు.