- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Parliament protest: రక్షణ మంత్రికి జాతీయజెండా ఇచ్చిన రాహుల్.. పార్లమెంటులో ఆసక్తికర ఘటన
దిశ, నేషనల్ బ్యూరో: పార్లమెంటు ఆవరణలో ఓ ఆసక్తిరకర ఘటన జరిగింది. కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్వయంగా వెళ్లి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) కి జాతీయ జెండాను ఇచ్చారు. అదానీపై అమెరికాలో నమోదైన కేసు గురంచి చర్చించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు వెలుపల కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. అదానీపై వచ్చిన లంచం ఆరోపణలపై చర్చలు జరపకుండా కేంద్ర ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపిస్తూ పార్లమెంట్ వెలుపల ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే, అదేసమయంలో పార్లమెంటుకు రాజ్ నాథ్ సింగ్ వచ్చారు. కారుదిగి పార్లమెంటులోకి ప్రవేశిస్తున్న కేంద్రమంత్రిని కాంగ్రెస్ ఎంపీలు చట్టుముట్టారు. తమ చేతుల్లేని జాతీయ జెండా, గులాబీ పువ్వుని ఆయనకు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఎంపీలు యత్నించారు. అయితే, రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి ఇవ్వడంతో వాటిని రాజ్ నాథ్ స్వీకరించారు. కాగా.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.