ఏం చేశారో చెప్పండి.. ప్రధాని మోడీపై రాహుల్ ప్రశ్నల వర్షం

by Satheesh |   ( Updated:2023-05-01 11:08:14.0  )
ఏం చేశారో చెప్పండి.. ప్రధాని మోడీపై రాహుల్ ప్రశ్నల వర్షం
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని ప్రచారంలో దూసుకెళ్తోంది. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాజాగా.. తుంకూరు జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రధాని మోదీపై ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రధాని మోదీ కర్ణాటకకు వచ్చిన ప్రతిసారీ తనపై విమర్శలు చేస్తున్నారనే తప్ప అభివృద్ధిపై దృష్టి సారించలేదన్నారు. గత మూడేళ్లుగా కర్ణాటకలో ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, యువత కోసం ఏం చేశారని నిలదీశారు. ఎన్నికల్లో ఎలా గెలవాలనేది కాదని, కర్ణాటక భవిష్యత్తు కోసం ఆలోచించాలని మోదీకి రాహుల్ గాంధీ హితబోధన చేశారు. కాంగ్రెస్ పార్టీ తమను 91 సార్లు విమర్శించిందని చెబుతున్న మోదీ.. కర్ణాటక కోసం ఏం చేశారో ఒక్కసారైనా చెప్పారా అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Read more:

ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే భవిష్యత్తుకు ప్రమాదం: ఖర్గే

Advertisement

Next Story

Most Viewed