- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rahul Gandhi: ఎన్డీఏ సర్కార్‌తో అదానీ, అంబానీలకే ప్రయోజనం: రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌తో సామాన్యులకు ఒరిగిందేమి లేదని, కేవలం అదానీ అంబానీలకే ప్రయోజనం చేకూరుతోందని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇవాళ ఆయన అసెంబ్లీల్లో మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల్లో ఇప్పటి వరకు స్పష్టమైన హామీ లభించలేదని ఆరోపించారు. కేంద్ర విధానాలు చూసి రైతులు భయాందోళనకు గురవుతున్నారని అన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు రైతు సంఘాల నేతలతో మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేనట్లుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. కరోనా లాంటి విపత్కర సమంలో పేద, మధ్య తరగతి ప్రజలంతా ప్రధాని చెప్పినట్లుగా చేశారని గుర్తు చేశారు.
నేడు బడ్జెట్‌లో మళ్లీ మధ్య తరగతి వారిపై అదనపు భారాన్ని మోపారని మండిపడ్డారు. నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో మిడిల్ క్లాస్ వాళ్లకు ఎలాంటి లబ్ధి చేకూర్చలేదని ఫైర్ అయ్యారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో నిబంధనలు సడలించి రైతులకు రుణమాఫీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అంబానీ, అదానీలకు మాత్రమే ప్రయోజన కలిగిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో స్పీకర్ ఓ బిర్లా కలుగజేసుకుని సభలో లేని వారి ప్రస్తావించడం సమంజసం కాదని రాహుల్‌కు నచ్చజెప్పారు. ఈ క్రమంలో రాహుల్ లేచి సభలో లేని వారి పేర్ల ప్రస్తావనకు మరో మార్గం ఉంటే చెప్పాలని సెటైర్లు వేశారు.