- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Amith sha : టెర్రరిస్టులను విడిపించడమే రాహుల్, ఒమర్ అబ్దుల్లా ఎజెండా!
దిశ, నేషనల్ బ్యూరో : జమ్ముకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి గెలిస్తే టెర్రరిస్టులు అందరినీ విడిచిపెడతారని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. మంగళవారం హర్యానాలోని లోహారులో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఎన్సీ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్ముకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి కోరుకుంటోందన్నారు. అదే విధంగా ఎన్నికలు అయ్యాక టెర్రరిస్టులు అందరినీ విడిచి పెట్టడమే రాహుల్ గాంధీ, ఒమర్ అబ్దులా ప్రధాన ఎజెండా అని ఘాటు విమర్శలు చేశారు. అయితే, ప్రధాని నరేంద్రమోడీ మాత్రం సాయుధ దళాల సామర్థ్యాన్ని మరింత పెంచారని గుర్తుచేశారు. కానీ, రాహుల్, అబ్దుల్లా మాత్రం పాకిస్తాన్‌తో చర్చలు జరిపి, అన్ని టెర్రరిస్టుల సంస్థలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేందుకు ప్లాన్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. కేంద్రంలో మోడీ ఉన్నంతవరకు ఎవరూ కూడా జమ్ముకాశ్మీర్‌కు అపాయం తలపెట్టలేరని, ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరని కుండబద్దలు గొట్టారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్ దేనని బీజేపీ భావిస్తుందన్నారు.
హర్యానాలో పాక్ జిందాబాద్ స్లోగన్స్..
హర్యానాలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీ అమిత్ షా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ బుబ్జగింపు రాజకీయాలు చేస్తోందన్నారు. పాకిస్థాన్ జిందాబాద్ వంటి నినాదాలు రాష్ట్రంలో పెరిగిపోతున్నాయి. దీనిని హర్యానా అంగీకరిస్తుందా? అని ప్రశ్నించారు.
‘హర్యానాకు చెందిన వేలాది మంది యువకులు కాశ్మీర్‌లో దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. కానీ, కాంగ్రెస్, ఎన్సీ నేతలు ఓ వైపు కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే రైతులు, క్రీడాకారులను గురించి మాట్లాడతారు. కానీ, మన ప్రభుత్వం క్రీడలకు అధునాతన సౌకర్యాలు లేని జిల్లాను వదిలిపెట్టలేదు. ఇప్పుడు మేము ప్రతి బ్లాక్, తహసీల్‌లో క్రీడలు, శిక్షణా సౌకర్యాలను సృష్టించే దిశగా వెళ్తాము’ అని అమిత్ షా తెలిపారు. కాగా, హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ -5న ఎన్నికలు, 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.