Rafale: నోయిడాలో రఫేల్ మరమ్మతులు.. త్వరలోనే యూనిట్ ఏర్పాటు చేయనున్న డసాల్ట్ !

by vinod kumar |
Rafale: నోయిడాలో రఫేల్ మరమ్మతులు.. త్వరలోనే యూనిట్ ఏర్పాటు చేయనున్న డసాల్ట్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు రఫేల్, మిరాజ్-2000 నిర్వహణ, మరమ్మతుల కోసం ఎయిర్‌క్రాఫ్ట్ తయారీదారు డస్సాల్ట్ ఏవియేషన్ నోయిడా సమీపంలో ఓ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. కొత్త కంపెనీ డస్సాల్ట్ ఏవియేషన్ మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్‌హాల్ ఇండియా (డీఏఎంఆర్‌వోఐ) ఆరు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, దాని పనులను క్రమంగా విస్తరిస్తుందని వెల్లడించారు. గతంలో డసాల్ట్‌లో పని చేసిన వెంకటరావు కొత్త యూనిట్‌కు సీఈఓగా నియామకమైనట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రస్తుతం 36 రఫేల్ విమానాలు, 50 మిరాజ్-2000 విమానాలను మెయింటెన్ చేస్తుంది. అంతేగాక ఐఎన్ఎస్ విక్రాంత్‌లో మోహరించే 26 రఫేల్ మెరైన్ విమానాల కోసం ఫ్రాన్స్‌తో చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 50,000 కోట్లుగా అంచనా వేస్తున్నారు.

Next Story

Most Viewed