రాయ్‌బరేలీ మరోసారి ప్రగతి పథాన్ని చూపాలి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

by samatah |
రాయ్‌బరేలీ మరోసారి ప్రగతి పథాన్ని చూపాలి: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ నియోజకవర్గం గతంలో రాష్ట్రానికి, దేశానికి సైద్దాంతిక రాజకీయ కేంద్రంగా ఉందని..మరోసారి తన ప్రగతి పథాన్ని చూపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు శనివారం తన సోదరి ప్రియాంకా గాంధీతో కలిసి ఓ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘దేశానికి దిశా నిర్దేశం చేయడంలో, భారతదేశ పురోగతిలో రాయ్‌బరేలీ ముఖ్యమైన పాత్రను కలిగి ఉంది. అంతేగాక స్వాతంత్ర్య పోరాటంలో మార్గాన్ని చూపింది’ అని వ్యాఖ్యానించారు. కాబట్టి ప్రజలు మరోసారి ఇదే దృక్పథాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు.

తాను తన కుటుంబాన్ని గౌరవిస్తానని, కుటుంబ సభ్యులందరితో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. రోజువారి జీవితంలో అబద్దాలు చెప్పేవారు రాజకీయాల్లోనూ అబద్దాలు చెబుతారని తెలిపారు. అలాగే ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ.. ప్రజలు తమ ఓటును ఆయుధంగా ఉపయోగించాలని సూచించారు. దీని ద్వారా వారి జీవితంలో అభివృద్ధి, పురోగతిని నిర్ధారించే లక్ష్యంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజల భవిష్యత్ మారేది ఓటు ద్వారా మాత్రమేనని స్పష్టం చేశారు. కాగా, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story