Puja Khedkar : ఐఏఎస్ నుంచి పూజా ఖేడ్కర్ డిస్మిస్.. కేంద్రం కీలక నిర్ణయం

by Hajipasha |
Puja Khedkar : ఐఏఎస్ నుంచి పూజా ఖేడ్కర్ డిస్మిస్.. కేంద్రం కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్‌‌ను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల (ఐఏఎస్) నుంచి డిస్మిస్ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఐఏఎస్‌‌కు పూజా ఖేడ్కర్‌ ఎంపికను రద్దు చేస్తూ జులై 31న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదేశాలు జారీ చేసింది. దీంతో సివిల్స్‌కు తన ఎంపికను రద్దు చేసే అధికారం యూపీఎస్సీకి లేదని, కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఆ హక్కు ఉందంటూ ఢిల్లీ హైకోర్టును పూజా ఖేడ్కర్‌‌ ఆశ్రయించారు.

ఈనేపథ్యంలో జోక్యం చేసుకున్న కేంద్ర సర్కారు ఆమెను ఐఏఎస్ సర్వీసుల నుంచి తప్పించింది. ఓబీసీ కోటా, వికలాంగుల కోటాను అక్రమ మార్గాల్లో వినియోగించుకొని సివిల్స్‌కు ఎంపికయ్యారనే అభియోగాలు పూజా ఖేడ్కర్‌పై దాఖలయ్యాయి. సివిల్స్‌కు ఎంపికయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాతో ముడిపడిన ఫోర్జరీ సర్టిఫికెట్లను ఆమె అందించారని యూపీఎస్సీ, ఢిల్లీ పోలీసులు నిర్ధారించారు.

Advertisement

Next Story

Most Viewed