J&K: జమ్మూకశ్మీర్‌లో ప్రజా భద్రతా చట్టం దుర్వినియోగం: ఒమర్ అబ్దుల్లా

by S Gopi |
J&K: జమ్మూకశ్మీర్‌లో ప్రజా భద్రతా చట్టం దుర్వినియోగం: ఒమర్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో ప్రజా భద్రత చట్టాన్ని దుర్వినియోగం చేశారని, ఎలాంటి కారణాలు చూపకుండా ఈ ప్రాంత యువతను వేధించారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎంపీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. యువకులను ఎలాంటి కారణాలు లేకుండా వేధించారు. వారిపై వివిధ చట్టాలను ప్రయోగించారు. స్థానిక జైళ్లు నిండిపోయినప్పటికీ యువతను జమ్మూకశ్మీర్ వెలుపల జైళ్లలో ఉంచారు. తద్వారా పీఎస్ఏ(పబ్లిక్ సేఫ్టీ యాక్ట్)ను దుర్వినియోగం చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వస్తే పీఎస్ఏను తొలగిస్తామని తమ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు చెప్పారు. అంతకుముందు జమ్మూకశ్మీర్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడం, వారి సీట్లను తగ్గించడం లక్ష్యమని తెలిపారు. పీర్ పంచల్, చీనాబ్‌తో సహా జమ్మూలో కూటమి ఖచ్చితంగా అవసరమని అన్నారు. కాగా, జమ్మూకశ్మీర్‌లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed