P.T. Usha elected as president of Indian Olympic Association

by Javid Pasha |   ( Updated:2022-11-28 15:51:22.0  )
P.T. Usha elected as president of Indian Olympic Association
X

దిశ, వెబ్ డెస్క్: భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలిగా లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష ఎన్నికయ్యారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 58 ఏళ్ల ఉష ఆదివారం అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేసింది. అయితే మరెవరూ ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఉష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవిని అధిరోహించనున్న మొదటి మహిళగా ఉష రికార్టు సృష్టించారు. అందరూ పయ్యోలీ ఎక్స్ ప్రెస్ గా పిలుచుకునే కేరళకు చెందిన పీటీ ఉష తన 25 ఏళ్ల కెరీర్ లో జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో మొత్తం 102 పతకాలను గెలుచుకుంది. క్రీడా రంగంలోఆమె చేసిన కృషికి గాను 2022 జూలై 6న బీజేపీ ఆమెను రాజ్యసభకు నామినేట్ చేసింది. కాగా..భారత ఒలంపిక్ సంఘం(IOA)లోని మిగతా 12 పదవుల కోసం 24 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వచ్చే నెల 10న IOA ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Next Story