- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ ఉద్యోగాలకు.. ఇక పీఆర్టీ సర్టిఫికేట్ తప్పనిసరి
దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సెమీ గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు ఇక 'పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ త్రిపుర సర్టిఫికేట్' (PRTC) తప్పనిసరిగా తీసుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహా మంగళవారం తెలిపారు. త్రిపుర యువకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.
'త్రిపుర రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా, ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ త్రిపుర సర్టిఫికేట్ అవసరమని కేబినెట్ నిర్ణయించింది' ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్ పోస్ట్ చేశారు. ఈ నిర్ణయాన్ని వెల్లడించే ముందు ఆయన త్రిపుర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కుష్ కుమార్ శర్మను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్ని రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లలో 'పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ త్రిపుర సర్టిఫికేట్'తో తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.