Priyanka Gandhi : తిరునెల్లి ఆలయంలో ప్రియాంక.. ‘ఎక్స్’‌లో ఎమోషనల్ పోస్ట్

by Hajipasha |
Priyanka Gandhi : తిరునెల్లి ఆలయంలో ప్రియాంక.. ‘ఎక్స్’‌లో ఎమోషనల్ పోస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్(Wayanad) లోక్‌సభ బైపోల్‌లో పోటీ చేస్తున్న ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi).. తన తండ్రి రాజీవ్‌గాంధీని గుర్తు చేసుకొని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం వయనాడ్‌లోని తిరునెల్లి ఆలయం(Thirunelli Temple)లో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ‘ఎక్స్’ వేదికగా ప్రియాంక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ ఆలయం నాకు చాలా స్పెషల్. దీనితో నాకు వ్యక్తిగతమైన అనుబంధం ఉంది. ఎందుకంటే దీని సమీపం నుంచి పారుతున్న పాపనాశిని నదిలోనే మా నాన్న(రాజీవ్ గాంధీ) చితాభస్మాన్ని నిమజ్జనం చేశారు’’ అని ఆమె తెలిపారు. ‘‘భగవాన్ మహా విష్ణువు రక్షణ, ఆశీర్వాదం వయనాడ్ ప్రజలకు లభించాలని.. వారందరికీ ఆరోగ్యం, ఆనందం ప్రాప్తించాలని నేను మనసారా కోరుకుంటున్నాను’’ అని ప్రియాంక చెప్పారు.

బుధవారం రోజు (నవంబరు 13న) వయనాడ్ ఉప ఎన్నికకు సంబంధించిన పోలింగ్ జరగబోతోంది. దీంతో ఆదివారం ఆమె వయనాడ్‌లో సుడిగాలి పర్యటన చేశారు. ‘‘వయనాడ్‌లో చాలామంది క్రైస్తవ వర్గం ప్రజలు నన్ను కలిశారు. వారందరి సాధకబాధకాలను నాకు చెప్పుకున్నారు. తప్పకుండా ఎన్నికల్లో గెలిచాక వారందరి గొంతుకగా మారుతాను. అన్ని వర్గాల తరఫున గళమెత్తుతా’’ అని ప్రియాంక తెలిపారు.

Advertisement

Next Story