ప్రియాంక గాంధీకి పూలు లేని బొకె.. ఎన్నికల ప్రచారంలో ఫన్నీ సీన్.. (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-11-08 13:09:28.0  )
ప్రియాంక గాంధీకి పూలు లేని బొకె.. ఎన్నికల ప్రచారంలో ఫన్నీ సీన్.. (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో సరదా సన్నివేశం చోటుచేసుకుంది. ఓ నేత చేసిన పనికి ప్రియాంకా గాంధీ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం సభకు ప్రియాంక హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు నేతలు ఆమెకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి పలకరించారు.

ఇంతలో వేదికపైకి వచ్చిన ఓ నేత ప్రియాంక చేతికి ఓ బొకే అందించి నమస్కారం చేశారు. అయితే అతడు ఇచ్చిన బొకేను చూసి ప్రియాంక బొకేలో ఫ్లవర్స్ లేకపోవడంతో ఆశ్చర్యపోయారు. ఆ బొకేను సదరు వ్యక్తికి చూపిస్తూ ఇందులో పూలు ఏవి అన్నట్లుగా ప్రశ్నించడంతో ఈ సీన్ అందరిని నవ్వులు పూయించింది. ఆ తర్వాత అదే బొకేను స్వీకరించిన ప్రియాంక తిరిగి నమస్కారం చేశారు.

Advertisement

Next Story