ప్రియాంకాగాంధీకి స్వల్ప అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

by Hajipasha |   ( Updated:2024-02-16 11:31:57.0  )
ప్రియాంకాగాంధీకి స్వల్ప అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె వెంటనే ఆస్పత్రిలో చేరారు. అస్వస్థతకు గురైనందు వల్ల శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించే భారత్ జోడో న్యాయ్ యాత్రలో తాను పాల్గొనలేనని ఆమె తెలిపారు. న్యాయ్ యాత్ర నిర్వహిస్తున్న తన సోదరుడు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులకు ఆమె శుభాకాంక్షలు చెప్పారు. తాను కోలుకున్న వెంటనే భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొంటానని ప్రియాంక పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక పోస్ట్ చేశారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న ఈ యాత్ర శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలోకి ప్రవేశించనుంది.


Advertisement

Next Story