బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ

by Mahesh |   ( Updated:2023-10-28 12:37:59.0  )
బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రియాంక గాంధీ
X

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ విమర్శలతో విరుచుకుపడ్డారు.యువతకు ఉద్యోగాల కల్పనలో రాష్ట్రంలోని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉందన్నారు. ‘‘గత 18 ఏళ్లుగా మధ్యప్రదేశ్‌లో బీజేపీయే అధికారంలో ఉంది. అయినా గడిచిన మూడేళ్లలో 21 ఉద్యోగాలనే అది క్రియేట్ చేయగలిగింది’’ అని ఆమె పేర్కొన్నారు. శనివారం మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో ప్రియాంకాగాంధీ ప్రసంగించారు.

‘‘దేశానికి జీవితమంతా సేవ చేసినందుకు ప్రతిఫలంగా పాత పెన్షన్ స్కీమ్‌(ఓపీీఎస్)ను అమల్లోకి తేవాలని ఉద్యోగులు కోరుతున్నారు. పాత పెన్షన్ స్కీమ్‌ ఉద్యోగుల హక్కు. కానీ మోడీ ప్రభుత్వం ఆ స్కీమ్ అమలుకు డబ్బులు లేవని చెబుతోంది. అదానీ వంటి బడా పారిశ్రామికవేత్తల వేల కోట్ల రుణాలను మాఫీ చేసేందుకు డబ్బు ఎక్కడ నుంచి వస్తోందో మోడీ చెప్పాలి’’ అని ఆమె ప్రశ్నించారు. కులగణన నిర్వహించే అంశంపై బీజేపీ వెనకడుగు వేస్తుండటంపై ప్రియాంక మండిపడ్డారు.

Advertisement

Next Story