Fake NCC Camp: తమిళనాడు నకిలీ ఎన్ సీసీ క్యాంపు కేసులో ట్విస్ట్

by Shamantha N |
Fake NCC Camp: తమిళనాడు నకిలీ ఎన్ సీసీ క్యాంపు కేసులో ట్విస్ట్
X

దిశ, నేషనల్ బ్యూరో: నకిలీ ఎన్‌సీసీ క్యాంపు పేరుతో బాలికపై లైంగిక వేధింపులకు పాల్పిడన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు పలు వేధింపుల కేసుల్లో శివరామన్(30) నిందితుడిగా ఉన్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో కాలు ఫ్రాక్చర్ కావడంతో కృష్ణగిరిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. అయితే, నిందితుడు శివరామన్‌ ను అరెస్టు చేయకముందే.. ఆగస్టు 19న ఎలుకల మందు తాగాడని పోలీసులు తెలిపారు. ఆరోగ్యం విషమించడంతో సేలంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి అతడ్ని తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా.. ఈ కేసులో ఇప్పటికే 11 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. బర్గూరు పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్, కరపస్పాడెంట్ కూడా అరెస్టయిన వారిలో ఉన్నారు.

కేసు ఏంటంటే?

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా బర్గూర్‌ సమీపంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నకిలీ ఎన్‌సీసీ క్యాంపు నిర్వహించారు. ఇందులో 17 మంది బాలికలు పాల్గొన్నారు. వారికి అక్కడే వసతి ఏర్పాటు చేశారు. అయితే, అక్కడే 13 ఏళ్ల బాలిపై శివరామన్ లైంగిక దాడికి పాల్పడ్డారు. ప్రిన్సిపల్ కు ఈ విషయాన్ని బాలిక చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాలిక అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులకు విషయం తెలియడంతో.. పోలీసులను ఆశ్రయించారు. కాగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు 11 మందిని అరెస్టు చేశారు. ఇదిలాఉండగా.. కేసు దర్యాప్తును వేగవంతం చేసి 60 రోజుల్లో ఛార్జిషీట్‌ దాఖలు చేయాలని తమిళనాడు సీఎం స్టాలిన్ పోలీసులను ఆదేశించారు. ఇతర ప్రాంతాల్లో నకిలీ ఎన్ సీసీ శిబిరాలు నిర్వహించి వేధింపులకు పాల్పడ్డారనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) విచారణ చేపడుతోంది.

Advertisement

Next Story

Most Viewed