'ది కేరళ స్టోరీ' సినిమాపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2023-05-05 11:52:25.0  )
ది కేరళ స్టోరీ సినిమాపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 'ది కేరళ స్టోరీ' సినిమాపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమా ఉగ్ర కుట్ర నేపథ్యంలో తెరకెక్కిందన్నారు. ఈ సినిమాలో కేరళలో జరుగుతోన్న ఉగ్రవాద కుట్రను బయటకు చూపారని తెలిపారు. టెర్రరిజంపై తీసిన సినిమాని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని, ఉగ్ర ధోరణులను నిలబెడుతోందని చెప్పారు. ఓటు బ్యాంకు కోసం కాంగ్రెస్ ఉగ్రవాదాన్ని కాపాడిందని ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు.

బళ్లారి పర్యటనలో

కాగా, కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం తప్పుడు కథనాలు, సర్వేలు చేస్తోందని అన్నారు. కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందన్నారు. నిషేధాలు, బుజ్జగింపులతో కాంగ్రెస్ మేనిఫెస్టో నిండిపోయిందని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. తాను బజరంగ్ బలి అనడం కాంగ్రెస్ నేతలకు ఇష్టం లేదని ప్రధాని మోదీ తెలిపారు.

ఉగ్రవాదానికి కాంగ్రెస్ లొంగిపోయింది: ప్రధాని మోదీ

ఓట్ల కోసం కాంగ్రెస్ ఉగ్రవాదానికి లొంగిపోయిందని ఆరోపించారు. అలాంటి పార్టీ ఎప్పుడైనా కర్ణాటకను కాపాడగలదా? అని ప్రశ్నించారు. భయానక వాతావరణంలో పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలు, వ్యవసాయం, వ్యవసాయం, అద్భుతమైన సంస్కృతి నాశనం అవుతుందని మోదీ స్పష్టంచేశారు.

Advertisement

Next Story

Most Viewed