కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు

by Satheesh |
కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో.. కర్ణాటకను నంబర్ వన్ రాష్ట్రంగా మార్చేందుకు రోడ్‌మ్యాప్ అని ప్రధాని మోడీ అన్నారు. మంగళవారం ఎన్నికల ప్రచార నేపథ్యంలో కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ తన హామీని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. మేనిఫెస్టోలో వారంటీ లేకుండా కాంగ్రెస్‌ హామీలు అబద్ధాలు తప్ప మరేమీ కాదన్నారు.

కాంగ్రెస్ చరిత్ర చూసుకుంటే ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను తృప్తిపరచడమేనని, సర్జికల్ దాడులు, వైమానిక దాడులు జరిగినప్పుడు ఆ పార్టీ దేశ రక్షణ దళాలను ప్రశ్నించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్, జేడీఎస్‌లు "ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని" ఆరోపించిన ప్రధాని, ఈ పార్టీలు అధికారంలోకి వస్తే కర్ణాటకలో పెట్టుబడులు, రాష్ట్రంలో యువతకు కొత్త అవకాశాలను సృష్టించలేదని అన్నారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ చరిత్రను, ఆలోచనలను ఎప్పటికీ మరచిపోకూడదన్నారు.

Advertisement

Next Story

Most Viewed