- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను భయపడే రకం కాదు.. లోక్‌సభలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం మోడీ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. సవాళ్లను చూసి కొందరు భయపడి పారిపోతారని అన్నారు. కానీ, తాను భయపడే రకం కాదని.. ఎన్ని సవాళ్లు వచ్చినా ఎదుర్కోవడం తనకు ఇష్టమని ప్రకటించారు. ఎన్నికలు రాగానే కొందరు హైరానా పడిపోయి.. భయాందోళనకు గురవుతారు. నాకు మాత్రం అలా ఉండదు. ఎన్నికలు అంటే ఆనందంగా, ఆసక్తిగా ఉంటుంది. ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిర నిర్మాణంతో ఎన్నో ఏళ్ల దేశ ప్రజల ఆకాంక్షను నెరవేర్చామని తెలిపారు. ఈ సందర్భంగా లోక్‌సభలో రామమందిర నిర్మాణంపై ధన్యవాద తీర్మాణం ప్రవేశ పెట్టారు.
బీజేపీ ఎంపీలు సత్యపాల్ సింగ్, ప్రతాప్ చంద్ర సారంగి, సంతోష్ పాండే రామమందిర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఎంపీలు కె.లక్ష్మణ్, సుదాన్షు త్రివేది, రాకేష్ సిన్హా తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టపై బీజేపీ ఎంపీలు చర్చను లేవనెత్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ఇవాళ్టితో బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి.