ఆస్ట్రియా చేరుకున్న ప్రధాని మోడీ..40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి

by vinod kumar |
ఆస్ట్రియా చేరుకున్న ప్రధాని మోడీ..40 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన అనంతరం మంగళవారం రాత్రి ఆస్ట్రియా చేరుకున్నారు. మాస్కో నుంచి వియన్నా చేరుకున్న ఆయనకు ఆస్ట్రియన్ చాన్సలర్ నెహమ్మర్ ఘన స్వాగతం పలికారు. మోడీ తన పర్యటనలో భాగంగా ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్‌, చాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో భేటీ అవనున్నారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, అనేక భౌగోళిక రాజకీయ సవాళ్లపై చర్చించనున్నారు. ఆస్ట్రియా పర్యటనకు ముందు మోడీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, న్యాయ పాలన ఉమ్మడి విలువలు కలిగిన రెండు దేశాలు ఎప్పటికీ సన్నిహిత భాగస్వామ్యాన్ని నిర్మించడానికి పునాదిగా ఉన్నాయన్నారు. కాగా, 40 ఏళ్లలో భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.1983లో ఆ దేశాన్ని చివరి సారిగా ఇంధిరా గాంధీ సందర్శించారు.

Advertisement

Next Story