తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు.. త్వరలో ప్రధాని మోడీ, షా పర్యటన!

by Ramesh N |
తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు.. త్వరలో ప్రధాని మోడీ, షా పర్యటన!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు రాబోతున్నారు. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు గెలుపొందడమే లక్ష్యంగా బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ప్రచారంలో బీజేపీ దూసుకపోతున్నది. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ఈ నెల 27న వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ నేతలతో ప్రధాని చర్చించన్నారు.

మరోవైపు హైటెక్ సిటీ నోవాటెల్‌లో ఐటీ నిపుణులతో ప్రధాని భేటీ కానున్నట్లు సమాచారం. అలాగే ప్రధాని మోడీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. మంత్రి అమిత్ షా బీజేపీ కీలక నేతలతో భేటీ అవనున్నారని తెలిసింది. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలపై చర్చించి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.

Advertisement

Next Story