భారత మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు: రాష్ట్రపతి ముర్ము

by GSrikanth |
భారత మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు: రాష్ట్రపతి ముర్ము
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. దేశంలో స్త్రీలు సాధించిన ప్రగతే సమాజ అభివృద్ధికి కొలమానం అని పేర్కొన్నారు. భారత మహిళలు ఆ రంగం.. ఈ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.. అన్ని రంగాల్లో ముందున్నారని అభినందించారు. ఈ సందర్భంగా మహిళల ప్రగతికి ఉన్న అవరోధాలను తొలగిద్దామని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్‌ కోసం స్వేచ్ఛనిద్దామని అని తెలిపారు. నారీ శ‌క్తిని సంబ‌రంగా జ‌రుపుకునే అవ‌కాశం ఇదే అన్నారు. క్రీడ‌ల నుంచి సైన్స్ వ‌ర‌కు, దేశాన్ని మహిళలు గ‌ర్వంగా నిలుపుతున్నార‌ని ముర్ము పేర్కొన్నారు.

Advertisement

Next Story