ఎన్నికల ప్రిడిక్షన్‌పై లెక్కలు.. ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్

by Sathputhe Rajesh |   ( Updated:2024-05-23 14:18:47.0  )
ఎన్నికల ప్రిడిక్షన్‌పై లెక్కలు.. ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంలో.. 2019లో ఏపీలో వైసీపీ పవర్‌లోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఇటీవల ఆయన కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని పలుమార్లు వ్యాఖ్యనించారు. అలాగే ఏపీలో వైసీపీకి ఘోర ఓటమి తప్పదని ప్రిడిక్షన్ చెప్పారు. అయితే తన అంచనాలపై పార్టీలు చేస్తున్న విమర్శలకు ట్విట్టర్ వేదికగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కౌంటర్ ఇచ్చారు. ‘మంచి నీరు తాగడం మనస్సు, శరీరం రెండింటీని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అలాగే ఈ ఎన్నికల ఫలితాల్లో తన అంచనాలపై గగ్గోలు పెడుతున్న వారు జూన్ 4న పుష్కలంగా నీటిని అందుబాటులో ఉంచుకోవాలి’ అని ప్రశాంత్ కిషోర్ సూచించారు.

Click Here For Twitter Post..

Advertisement

Next Story