- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PM Modi : సీజేఐ ఇంటికి ప్రధాని మోడీ.. నెట్టింట విమర్శలు.. వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో బుధవారం నిర్వహించిన గణపతి పూజలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ప్రధాని మోడీ సీజేఐ ఇంటికి రావడం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇది న్యాయమూర్తుల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్టేనని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ ఎక్స్‌లో వీడియో షేర్ చేశారు. ‘ప్రైవేట్ మీట్ కోసం సీజేఐ చంద్రచూడ్ తన నివాసానికి మోడీని అనుమతించడం దిగ్భ్రాంతికరం. రాజ్యాంగ పరిధిలో పనిచేసే న్యాయవ్యవస్థపై ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి’ అని ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు.
కాగా, ప్రధాని మోడీ ప్రత్యేకంగా పూజలో పాల్గొన్న వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని ఒక సీజేఐ ఇంటికి ప్రైవేటుగా పోవడం ఎంత వరకు కరెక్ట్ అని పలువురు నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొంత మంది నెటిజన్లు మాత్రం ప్రధాని సీజేఐ ఇంటికి పోవడంపై సమర్ధిస్తున్నారు. ప్రధాని పూజ లో పాల్గొనడం తప్పుడు సంకేతాలు ఎలా అవుతాయని కామెంట్స్ చేస్తున్నారు.