- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ వినియోగంపై 2022-23 గణాంకాలు వెల్లడించిన కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలో విద్యుత్ వినియోగంపై కేంద్రం నివేదికను విడుదల చేసింది. 2022-23లో విద్యుత్ వినియోగం 9.5 శాతం పెరిగిందని తెలిపింది. ఏడాదిలో విద్యుత్ వినియోగం 1,503.65 బిలియన్ యూనిట్లకు చేరగా, ప్రధానంగా ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో డిమాండ్ ఎక్కువగా ఉందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి. అంతకుముందు 2021-22కు గానూ 1,374.02 బిలియన్ యూనిట్లు వినియోగం జరిగిందని కేంద్ర విద్యుత్ అధికార సంస్థ పేర్కొంది.
అయితే డిమాండ్ సమయంలో విద్యుత్ సరఫరా పెరిగిందని తెలిపింది. ప్రస్తుత ఏడాదిలోనూ వినియోగం పెరుగుతుందని అంచనా వేసింది. కాగా వేసవికాలం విద్యుత్ డిమాండ్ రోజుకు 229 గిగా వాట్లకు చేరవచ్చని విద్యుత్ మంత్రిత్వ శాఖ భావిస్తోంది. ఇప్పటికే అన్ని బొగ్గు ఆధారిత ప్లాంట్ల నిల్వలు ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక కార్యకలాపాలు పెరగడం వల్లే విద్యుత్ సరఫరాలో డిమాండ్ పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. మార్చిలో అంతకుముందు ఏడాదితో పోలిస్తే విద్యుత్ వినియోగం కాస్తా తగ్గింది. దీనికి ఆకస్మిక వర్షాలే కారణమని పేర్కొంది.