- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జమిలీ ఎన్నికలు కావాలని కోరిన జమ్మూ కశ్మీర్ పార్టీలు
దిశ, నేషనల్ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెండు రోజుల పాటు జమ్మూ కశ్మీర్‌లోని పార్టీలతో కేంద్ర ఎన్నికల సంఘం చర్చ నిర్వహించింది. ఈ సమావేశంలో జమ్మూ కశ్మీర్ పార్టీలు లోక్‌సభ ఎన్నికలతో పాటే అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించాలని కోరాయి. వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు మద్దతిస్తున్నట్టు స్పష్టం చేశాయి. జమిలీ ఎన్నికలను జమ్మూ కశ్మీర్‌తోనే ప్రారంభించాలని తెలిపారు. సుమారు ఆరేళ్ల నుంచి రాష్ట్రంలో ఎన్నికలు లేవు, రాష్ట్రపతి పాలనలోనే ఉన్నామని ఈసీ ముందు మొరపెట్టుకున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్, గులాం నబీ ఆజాద్‌కు చెందిన డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీలు ఈ మేరకు విజ్ఞప్తి చేశాయి. లోక్‌సభ, జమ్మూకశ్మీర్ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. జమ్మూ కశ్మీర్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం అక్కడికి చేరుకున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఇతర పోల్ ప్యానెల్ అధికారులు పార్టీల ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలు, ఎన్నికల నిర్వహణపై చర్చించారు.