సన్నీలియోన్ పేరుతో పోలీస్ పరీక్షల హాల్ టికెట్: సోషల్ మీడియాలో ఫొటో వైరల్

by samatah |
సన్నీలియోన్ పేరుతో పోలీస్ పరీక్షల హాల్ టికెట్: సోషల్ మీడియాలో ఫొటో వైరల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన హాల్ టికెట్లలో విచిత్రం జరిగింది. బాలీవుడ్ నటి సన్నీలియోన్ పేరుతో ఓ హాల్ టికెట్‌ రిలీజైంది. దానిపై సన్నీలియోన్ పేరు, ఫొటో, రిజిస్ట్రేషన్ నంబర్, ఎగ్జామ్ సెంటర్‌తో సహా ఇతర వివరాలు ఉన్నాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (యూపీపీఆర్‌బీ) స్పందించింది. ఆ హాల్ టికెల్ ఫేక్ అని తెలిపింది. దరఖాస్తు సమయంలో ఎవరైనా అభ్యర్థి తప్పుడు వివరాలు అప్‌లోడ్ చేసి ఉంటారని పేర్కొంది. అప్లికేషన్ టైంలో రిజిస్టరైన మొబైల్ నంబర్ రాష్ట్రంలోని మహోబా నగరానికి చెందినదిగా గుర్తించారు. రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో అందించిన చిరునామా ముంబైలో ఉంది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని యూపీపీఆర్‌బీ తెలిపింది. కాగా, 60,244 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఉత్తరప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో పరీక్షను నిర్వహిస్తున్నారు. గత రెండు రోజుల్లో జరిగిన పరీక్షలో అవకతవకలకు పాల్పడినందున 120 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Next Story

Most Viewed