Pm Starmer: దీపావళి విందులో నాన్ వెజ్, ఆల్కహాల్.. బ్రిటన్ ప్రధాని తీరుపై అసంతృప్తి!

by vinod kumar |
Pm Starmer: దీపావళి విందులో నాన్ వెజ్, ఆల్కహాల్.. బ్రిటన్ ప్రధాని తీరుపై అసంతృప్తి!
X

దిశ, నేషనల్ బ్యూరో: దీపావళి (Diwali) పండుగను ఇటీవల భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వివిధ దేశాధినేతలు సైతం అక్కడి హిందువులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. భారత్‌తో దౌత్య వివాదం కొనసాగుతున్న కెనడాలోనూ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అంతేగాక ఆదేశ ప్రధాని ట్రూడో సైతం సెలబ్రేషన్స్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యపర్చారు. అయితే దీపావళి పండుగ రోజు బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keer starmar) అక్కడి హిందువులకు పార్టీ ఇవ్వడం వివాదంగా మారింది. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో దీపావళి సందర్భంగా స్టార్మర్ విందు ఏర్పాటు చేయగా.. ఆ పార్టీలో నాన్ వెజ్ వంటకాలతో పాటు ఆల్కహాల్ కూడా ఏర్పాటు చేసినట్టు పలువురు పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రస్తుతం వివాదంగా మారింది. స్మార్మర్ దీపావళి వేడుకపై హిందువులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌సైట్ యూకే వంటి అనేక హిందూ సంస్థలు సోషల్ మీడియాలో ఈ అంశాన్ని లేవనెత్తాయి. ‘దీపావళి పండుగ కేవలం జరుపుకోవడం మాత్రమే కాదు. దీనికి లోతైన మతపరమైన ప్రాముఖ్యత ఉంది. మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండటంతో సహా ఈ పండుగకు సంబంధించిన మతపరమైన సంప్రదాయాలను గౌరవించడం చాలా ముఖ్యం. ప్రధాని స్వయంగా నిర్వహించే దీపావళి వేడుకలో మెనూ ఎంపిక దీపావళి పండుగకు సంబంధించిన మతపరమైన సంప్రదాయాలపై అవగాహన లేకపోవడం సరికాదు’ అని ఇన్ సైట్ యూకే ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందు హిందూ సమాజాన్ని సంప్రదించారా అని ప్రశ్నించింది. అయితే ఈ వివాదంపై డౌనింగ్ స్ట్రీట్ స్పందించలేదు.

Advertisement

Next Story

Most Viewed