- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రాగన్ కంట్రీ కొత్త మ్యాప్‌పై రాహుల్ రియాక్షన్..
న్యూఢిల్లీ : చైనా వివాదాస్పద మ్యాప్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టేట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘లడఖ్‌లో ఒక్క అంగుళం భూమి కూడా పోలేదని ప్రధాని మోడీ చెప్పింది అబద్ధమని నేను చాలా సంవత్సరాలుగా చెబుతున్నాను. చైనా ఆక్రమణ విషయం లడఖ్ మొత్తానికి తెలుసు. ఈ మ్యాప్ అంశం చాలా తీవ్రమైనది. చైనా వాళ్లు భూమిని లాక్కున్నారు. దీనిపై ప్రధాని స్పందించాలి’ అని రాహుల్ కోరారు. చైనా అరుణాచల్ ప్రదేశ్‌లోకి చొరబడేందుకు యత్నిస్తోందని, మోడీకి ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా కౌంటర్ ఇచ్చారు.
చైనా కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ మధ్య 2008లో ఒప్పందం కుదిరిందని.. అందువల్లే చైనాను రాహుల్ సమర్ధిస్తున్నారని విమర్శించారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో చైనా 43,000 చదరపు కిలోమీటర్లకు పైగా భారత భూభాగాన్ని ఆక్రమించిందని ఆరోపించారు. రాహుల్‌కు చైనా మ్యాప్‌పై ఉన్న నమ్మకం.. భారత రక్షణ శాఖపై లేకపోవడం సరికాదన్నారు. చైనా మ్యాప్‌పై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ స్పందిస్తూ.. ఇలాంటి మ్యాప్‌లను విడుదల చేయడం చైనాకు అలవాటుగా మారిందని మండిపడ్డారు. ఇలాంటి మ్యాప్‌ల వల్ల భూభాగాలు సొంతం కావని చైనా తెలుసుకోవాలన్నారు.