PM Modi: కొన్ని పార్టీలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయ్: మోడీ

by Shiva |   ( Updated:2024-07-22 06:44:45.0  )
PM Modi: కొన్ని పార్టీలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయ్:  మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఎదురవుతోన్న సవాళ్లను ఎప్పటికప్పుడు అధిగమిస్తూ.. తమ ప్రభుత్వం దేశ అభివృద్ధి కోసం నిత్యం పోరాడుతోందని, కానీ కొన్ని పార్టీలు ప్రతికూల రాజకీయాలు చేస్తున్నాయని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరికాసేపట్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ మీడియాతో కాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా పార్లమెంట్ సమావేశాలు కొనసాగాలని ఆకాంక్షించారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీలు అన్ని తమ శక్తి మేర సమర్ధవంతంగా పోరాడాయని, ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో ఇచ్చేశారంటూ కామెంట్ చేశారు. 2047 నాటికి వికసిత్‌ భారత్‌‌గా దేశాన్ని తీర్చిదిద్దుతామని అన్నారు. తమ ప్రభుత్వం మూడోసారి అధికారంలో మరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా సంతోషకరమని అన్నారు. ఐదేళ్లు దేశ ప్రగతి కోసం అంకితమవుతామని పేర్కొన్నారు. ముందుగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే పనిలో ఉంటామని.. ఆ తరువాతే వచ్చే ఎన్నికల గురించి ఆలోచన చేస్తామని అన్నారు.

కానీ, కొన్ని పార్టీలు ప్రతికూల రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దేశాభివృద్ధి కోసం తమతో కలిసి రావాలంటూ విపక్షాలకు ప్రధాని పిలుపునిచ్చారు. అర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అమృతకాలంలో అదొక అద్భుతమైన బడ్జెట్‌ అంటూ కొనియాడారు. బడ్జెట్‌ సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన ఎంపీలకు అవకాశం ఇవ్వాలని కోరారు. కాగా, బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నారు. ఈ క్రమంలో నీట్ లీకేజీ, కన్వర్ యాత్ర, రైల్వే ప్రమాదం అంశాలపై ప్రశ్నించి ఆందోళన చేసేందుకు మరోవైపు విపక్షాలు సిద్ధమవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed