- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ మౌనం.. మణిపూర్‌కు శాపం : ఖర్గే
దిశ, నేషనల్ బ్యూరో : మణిపూర్ హింసాకాండపై ప్రధాని మోడీ మౌనాన్ని ఆ రాష్ట్రానికి అన్యాయం చేయడం లాంటి చర్యగానే చూడాల్సి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. మణిపూర్‌లో పరిస్థితులను చక్కదిద్దే అంశంపై ప్రధాని నిష్క్రియాత్మక వైఖరితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈమేరకు వ్యాఖ్యలతో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. మణిపూర్‌లో ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ధ పాలనను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని ఖర్గే డిమాండ్ చేశారు. ‘‘తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న మణిపూర్ అంశంపై నేను మీకు ఈ లేఖ రాస్తున్నాను. మణిపూర్‌లో హింసాకాండ మొదలై దాదాపు తొమ్మిది నెలలు గడిచాయి. అక్కడ రోజురోజుకు పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది’’ అని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తన లేఖలో పేర్కొన్నారు. ‘‘జనవరి 24న మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని చారిత్రాత్మక కాంగ్లా కోటలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కీలకమైన ప్రభుత్వ సమావేశం జరిగింది. దీనికి కేంద్ర, రాష్ట్ర భద్రతా బలగాలు భద్రతను కల్పించాయి. ఇంత సెక్యూరిటీ నడుమ సమావేశం జరుగుతున్న ప్రదేశం వద్దే కాంగ్రెస్ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కైషమ్ మేఘచంద్రపై దుండగులు దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారు. ఇది చాలా అరాచకం’’ అని ఖర్గే చెప్పారు. మణిపూర్‌లో పాలనా వ్యవస్థ కూలిపోయిందనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో అలుముకుందన్నారు.