- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇటలీలో జరిగే జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్న మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: జీ7 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆయన గురువారం ఇటలీ బయల్దేరనున్నారు. జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని బోర్గో ఎగ్నాజియా విలాసవంతమైన రిసార్ట్‌లో ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు ప్రధాని మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయేల్ మ్యాక్రాన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో హాజరుకానున్నారు. జీ7 సదస్సులో ఉక్రెయిన్ యుద్ధం, గాజా ఘర్షణలను గురించి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కూడా ఈ సదస్సులో ప్రసంగించనున్నారు. రష్యా తమపై చేస్తున్న యుద్ధం గురించి మాట్లాడనున్నారు.
స్విట్జర్లాంట్ లో శాంతి శిఖరాగ్ర సమావేశం
స్విట్జర్లాండ్‌లో జరిగే గ్లోబల్ పీస్ సమ్మిట్‌లో భారత్ పాల్గొంటుందని విదేశాంగ కార్యదర్శి క్వాత్రా తెలిపారు. జూన్ 15-16 తేదీల్లో జరిగే ఉక్రెయిన్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి స్విట్జర్లాండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. స్విట్జర్లాండ్‌లోని లూసర్న్ సరస్సు పై ఉన్న బర్గెన్‌స్టాక్ హోటల్‌లో ఈ సదస్సు జరుగుతుంది. భారతదేశం సముచిత స్థాయిలో శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటుందని క్వాత్రా చెప్పారు. సమ్మిట్‌లో భారత్‌కు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనే విషయాన్ని క్వాత్రా పేర్కొనలేదు. అయితే, మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నికైనప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆయకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రపంచ శాంతి సదస్సు గురించి చర్చించి.. అత్యున్నత స్థాయిలో భారత్ పాల్గొనాలని కోరారు. అలానే, సరైన సమయంలో ఉక్రెయిన్ ని సందర్శించాలని మోడీని ఆహ్వానించారు. ఇకపోతే, ఈ సమ్మిట్ ముఖ్య లక్ష్యం ఉక్రెయిన్ లో శాశ్వత శాంతి స్థాపన. గత నెలలో స్విస్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 160 కంటే ఎక్కువ దేశాల నాయకులను సమ్మిట్ కు రావాల్సిందిగా ఆహ్వానించింది. దాదాపు 107 దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ఈ సదస్సులో పాల్గొననున్నట్లు తెలిపాయి.