- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
NITI Aayog : రేపు నీతి ఆయోగ్ పాలకమండలి భేటీ.. ఎజెండా ఇదే
X
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన శనివారం రోజు (జులై 27) ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ వేదికగా నీతి ఆయోగ్ పాలక మండలి 9వ సమావేశం జరగనుంది. ఈసారి ‘వికసిత్ భారత్ @ 2047’ అనే థీమ్‌తో ఈ భేటీ జరగబోతోంది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే సంకల్పంతో ఈ థీమ్‌ను ఎంపిక చేశారు. ఈవివరాలను నీతి ఆయోగ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
‘వికసిత్ భారత్ @ 2047’ విజన్ డాక్యుమెంట్ అంశానికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికపై పాలక మండలి సమావేశంలో చర్చ జరుగుతుందని వెల్లడించింది. వికసిత భారత్ సాధనకు సంబంధించిన ప్రణాళికలో రాష్ట్రాలను ఎలా మమేకం చేయాలనే దానిపైనా డిస్కషన్ ఉంటుందని పేర్కొంది. దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత సమర్ధంగా ఎలా అమలు చేయొచ్చనే దానిపై నీతి ఆయోగ్ భేటీలో చర్చించనున్నారు.
Advertisement
Next Story