- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాహుల్ గాంధీ ప్రకటనలను ప్రధాని మోడీ దురుద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారు: జైరాం రమేష్
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హిందూ రాజులను అవమానించారని, సుల్తానుల దౌర్జన్యాలపై మౌనంగా ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శలు చేశారు. అయితే, దీనికి ఘాటుగా బదులిచ్చిన కాంగ్రెస్ పార్టీ మోడీపై ఎదురుదాడికి దిగింది. మతపరమైన బేధాభిప్రాయాలను రెచ్చగొట్టేలా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను దురుద్దేశపూర్వకంగా మోడీ వక్రీకరిస్తున్నారని ఆరోపించింది. మోడీ పూర్తి నిస్సహాయతలోకి కూరుకుపోయారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మండిపడ్డారు. 'ప్రధాని మోడీ దురుద్దేశంతోనే రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి వ్యాఖ్యను వక్రీకరిస్తున్నారు. మతపరమైన భావాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ' జైరాం రమేష్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమనే మోడీ గ్రహించారు. ఆ నిరాశను అధిగమించేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని, ఎన్నికల ప్రచారంలో ఇటువంటి ప్రసంగాలు చేయడం నిజంగా సిగ్గుచేటని జైరాం రమేష్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.