- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'పీఎం సూర్య ఘర్ ' పథకాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: దేశీయంగా సోలార్ విద్యుత్ వినియోగాన్ని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం 'పీఎం సూర్య ఘర్; ముఫ్త్ బిజ్లీ యోజనా' పథకాన్ని ప్రారంభించారు. సోలార్ విద్యుత్ విస్తరణ ద్వారా సామాన్యులపై కరెంట్ ఛార్జీల భారాన్ని తగ్గించవచ్చని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. దీన్ని అమలు చేసే ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కావాలనుకునేవారు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని మోడీ ప్రకటనలో తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రూ. 75,000 కోట్లకు పైగా పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని మోడీ పేర్కొన్నారు. ' మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం 'పీఎం సూర్య ఘర్; ముఫ్త్ బిజ్లీ యోజనా' పథకాన్ని ప్రారంభించాం. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతినెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించే కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని భావిస్తున్నాం. ఈ పథకాన్ని ఎంచుకున్న వారికి లభించే సబ్సిడీ నేరుగా తమ ఖాతాల్లోనే పొందవచ్చు. రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు కోసం బ్యాంకుల నుచి అధిక రాయితీతో కూడిన రుణాలను కూడా పొందే వీలుందని, ప్రజలపై ఎలాంటి భారం లేని విధంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు' మోడీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ పథకం విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించడమే కాకుండా ఉపాధి కల్పనకు కూడా అవకాశం ఉంటుందని మోడీ వెల్లడించారు.