బిహార్ కొత్త టీమ్‌కు నా అభినందనలు : ప్రధాని మోడీ

by Hajipasha |
బిహార్ కొత్త టీమ్‌కు నా అభినందనలు : ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో : బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక ట్వీట్ చేశారు. బిహార్‌లో ఏర్పడిన కొత్త టీమ్‌కు, సీఎం నితీశ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ‘‘బిహార్‌లో ఏర్పాటైన ఎన్‌డీఏ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఉన్న ఏ అవకాశాన్ని కూడా వదలబోదు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నితీష్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేసిన సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలకు నా అభినందనలు’’ అని మోడీ పేర్కొన్నారు. ‘‘ఈ కొత్త టీమ్ నా కుటుంబ సభ్యుల్లాంటి బిహార్ రాష్ట్ర ప్రజలకు పూర్తి అంకితభావంతో సేవ చేస్తుందనే నమ్మకం నాకు ఉంది’’ అని ఆయన చెప్పారు.


Advertisement

Next Story