- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
8 కోట్ల మంది రైతులకు రూ. 16,800 కోట్లు
- పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్న మోడీ
న్యూఢిల్లీ: హోలీ పండగ, రబీ పంట సందర్భంగా ప్రధాన మంత్రి-కిసాన్ పథకం కింద నరేంద్ర మోడీ సోమవారం 8 కోట్ల మంది అర్హులైన రైతులకు రూ. 16,800 కోట్లను విడుదల చేయనున్నారు. అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2000 చొప్పున ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద మూడు సమాన వాయిదాలలో సంవత్సరానికి రూ. 6000 అందజేస్తారు. ఈ డబ్బులను రైతుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా బదిలీ చేస్తారు.
ఈ పథకం 2019లో ప్రారంభించారు. కానీ నిజానికి 2018 నుంచే అమల్లోకి వచ్చింది. కర్ణాటక బెలగావిలో జరగనున్న కార్యక్రమంలో ప్రధాని ఈ నిధులను విడుదల చేస్తారని అధికారిక ప్రకటన వెలువడింది. పీఎం-కిసాన్, జల్ జీవన్ మిషన్ పథకాలకు చెందిన ఒక లక్ష మంది లబ్ది దారులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పీఎం-కిసాన్ పథకం 11, 12 ఇన్‌స్టాల్‌మెంట్స్ గతేడాది మే, అక్టోబర్‌లలో విడుదల చేశారు. పీఎం-కిసాన్ పథకం ఇప్పటికే రైతులకు గణనీయమైన ప్రయోజనాలను అందించింది. తాజాగా ఇచ్చే ఇన్‌స్టాల్‌మెంట్ వ్యవసాయరంగం అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా రైతుల ఆదాయానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద 11 కోట్ల చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు రూ. 2.25 లక్షల కోట్లు పంచారు.