- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేజ్రీవాల్ వర్సెస్ సుర్జీత్ సింగ్ యాదవ్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కేజ్రీవాల్‌ను తక్షణమే సీఎం పదవి నుంచి తొలగించాలంటూ సుర్జీత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మనీ లాండరింగ్‌కు పాల్పడిన వ్యక్తికి ఢిల్లీ సీఎంగా కొనసాగే నైతిక హక్కు లేదని పిటిషనర్ కోర్టు ఎదుట వాదన వినిపించాడు. అరెస్టయి ఈడీ అదుపులో ఉన్న కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఏ అధికారంతో ముఖ్యమంత్రి పదవిని నిర్వహిస్తున్నారనే దానిపై కేంద్ర సర్కారు, ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి వివరణ కోరాలని న్యాయస్థానానికి సుర్జీత్ సింగ్ రిక్వెస్ట్ చేశారు. అయితే సుర్జీత్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌లో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిని సవరించిన తర్వాత విచారణ కోసం లిస్టింగ్ చేస్తామని కోర్టు వర్గాలు వెల్లడించాయి.