మళ్లీ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలి.. సుప్రీం కోర్టులో పిల్

by Mahesh |
మళ్లీ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడాలి.. సుప్రీం కోర్టులో పిల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఒడిశా రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిల్(ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలైంది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని నిపుణుల బృందంతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయవాది విశాల్ తివారీ పిటిషన్‌ దాఖలు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఉండేందుకు కవాచ్‌ను అమలు చేయాలని కూడా పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. రైలు భద్రతను నిర్ధారించేందుకు మార్గదర్శకాలను రూపొందించాలని, రెండు నెలల్లో కమిషన్ తన నివేదికను కోర్టుకు సమర్పించాలని పేర్కొన్నారు.

కాగా, శుక్రవారం షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బాలేశ్వర్ దగ్గర పట్టాలు తప్పి ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కోరమండల్‌కు చెందిన 12 బోగీలు చెల్లాచెదురుగా పక్కనే ఉన్న మూడో రైల్వే లైన్ (ట్రాక్)పై పడ్డాయి. ఈ ప్రమాదం 6 గంటల 50 నిమిషాలకు జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అధికారులు. ఆ తర్వాత 15 నిమిషాలకు అంటే.. 7 గంటల 15 నిమిషాల సమయంలో బెంగళూరు నుంచి హౌరా వెళుతున్న యశ్వంత్ పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపై పడిపోయిన కోరమండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలను ఢీ కొట్టాయి.

Advertisement

Next Story