రైల్వే ట్రాక్‌పై ఫొటో షూట్.. సడెన్‌గా ట్రైన్ రావడంతో 90 అడుగుల లోతులోకి దూకడంతో..4

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-15 05:55:45.0  )
రైల్వే ట్రాక్‌పై ఫొటో షూట్.. సడెన్‌గా ట్రైన్ రావడంతో 90 అడుగుల లోతులోకి దూకడంతో..4
X

దిశ, వెబ్‌డెస్క్: రీల్స్, సోషల్ మీడియా, ఫొటో షూట్‌ల పిచ్చి రోజురోజుకు ముదురుతోంది. ప్రమాదకరమని తెలిసిన అనేక మంది చేసే కొన్ని పనులు విషాదాన్ని మిగిలుస్తున్నాయి. తాజాగా, రాజస్థాన్‌లో 90 అడుగుల ఎత్తులో ఓ యువ జంట ఫొటో షూట్ చేసుకుంటోంది. అయితే సడెన్‌గా మూల మలుపు మీదుగా ట్రైన్ రావడంతో భయాందోళనకు గురై రాహుల్ (22), జాన్వి (20) ఒక్క సారిగా బ్రిడ్జిపై నుంచి 90 లోతులోకి దూకేశారు. దీంతో రాహుల్‌కు వెన్నుముకకు తీవ్ర గాయం అవగా.. జాన్వికి కాలు విరిగింది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ యువ జంట ట్రైన్ రావడంతో దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే వీరు దూకే సమయానికి ట్రైన్‌ను లోకో పైలట్ ఆపేయడం గమనార్హం.

Advertisement

Next Story