నోట్ల కట్టలపై పడుకున్న వ్యక్తితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు: UPPL

by Harish |
నోట్ల కట్టలపై పడుకున్న వ్యక్తితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదు: UPPL
X

దిశ, నేషనల్ బ్యూరో: అస్సాంకు చెందిన ఒక రాజకీయ నేత నోట్ల కట్టలపై పడుకున్న ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉదాల్‌గిరి జిల్లాకు చెందినటువంటి బెంజమిన్ బసుమతరీ రూ.500 నోట్ల కట్టలపై నిద్రిస్తున్న ఫొటో బయటకు రాగా, ఈయన ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా హట్ టాపిక్‌ అయింది. అయితే ఈ ఫొటోపై యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ ప్రెసిడెంట్ ప్రమోద్ బోరో స్పందించారు. జనవరి 10, 2024న ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేశాము, బెంజమిన్‌కు పార్టీతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. అలాగే, ఫిబ్రవరి 10, 2024న VCDC ఛైర్మన్ పదవి నుండి కూడా ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.

బెంజమిన్ బాసుమతరీ‌పై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రామీణ ఉపాధి హామీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో ఐదేళ్ల క్రితం నాటిది అని బెంజమిన్ సన్నిహితులు కావాలనే దీనిని తీశారని సమాచారం. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికలకు ముందు అస్సాంలో ఈ ఫొటో వివాదానికి దారితీసింది.

Advertisement

Next Story