- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Kharge : మోడీ సర్కారుకు ప్రజలే గుణపాఠం చెబుతారు : ఖర్గే
దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రంలోని మోడీ సర్కారుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. దేశంలో వరుసగా చోటుచేసుకున్న రైలు ప్రమాద ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని.. వీటిని నివారించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు తగిన గుణపాఠం నేర్పక ముందే మేల్కొనాలని సూచించారు. రైల్వే శాఖలోని కీలక సాంకేతిక విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయకుంటే రైల్వేలు నిర్వీర్యం అవుతాయని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు.
రైల్వే శాఖ బలహీనపడినందు వల్లే రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రైల్వేలకు కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. బడ్జెట్ రూపకల్పనలో బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఖర్గే పేర్కొన్నారు. బడ్జెట్ లాంటి ముఖ్యమైన విషయంలో ప్రతిపక్షాలు, రాష్ట్రాల సూచనలను కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు.