పాకిస్తాన్ ప్రజలు సంతోషంగా లేరు.. అది తప్పని భావిస్తున్నారు : ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్

by Vinod kumar |
పాకిస్తాన్ ప్రజలు సంతోషంగా లేరు.. అది తప్పని భావిస్తున్నారు : ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్
X

న్యూఢిల్లీ: రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటిన పాకిస్తాన్ ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. ఎందుకంటే భారత్ నుంచి విడిపోవడం తప్పని వారు భావించడమేనని అన్నారు. యువ సంస్కర్త హేము కులానీ జయంతి వేడుకల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారత్ నుంచి విడిపోయిన వారు ఇప్పటికీ సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. వారు బాధలో ఉన్నారని అన్నారు.

అయితే భారత్‌ది ఇతర దేశాలపై దాడి చేసే సంస్కృతి కాదని చెప్పారు. కాకపోతే తమ జోలికి వస్తే వదలిపెట్టబోమని తెలిపారు. విభజన సమయంలో ఇక్కడికి వచ్చిన వారిలో ఎక్కువ మంది సింధీ కమ్యూనిటీని అభినందించారు. సుసంపన్నమైన సింధు సంస్కృతి, విలువల కోసం వారు అవిభక్త భారత్ నుంచి ఈ భారత్‌కు వచ్చారని భగవత్ అన్నారు.

Advertisement

Next Story