ముస్లిం మహిళల హక్కులను అడ్డుకునేందుకు కొత్త మార్గాలు: ప్రధాని మోడీ

by Disha Desk |
ముస్లిం మహిళల హక్కులను అడ్డుకునేందుకు కొత్త మార్గాలు: ప్రధాని మోడీ
X

లక్నో: ముస్లిం మహిళల హక్కులను అడ్డుకునేందుకు కొందరు కొత్త మార్గాలతో వస్తున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యోగీ ప్రభుత్వం ముస్లిం, మహిళలపై వ్యతిరేక నేరాలను అడ్డుకునేందుకు ఎల్లప్పుడూ పనిచేస్తుందని అన్నారు. గురువారం సహరన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. విపక్షాలు ఓట్ల కోసం ముస్లిం మహిళల అభివృద్ధికి అడ్డుగా నిలిచాయని ఆరోపించారు. ట్రిపుల్ తలాక్‌పై నిషేధం విధించి వారి సాధికారత కోసం బీజేపీ ప్రభుత్వం పని చేసిందన్నారు. అయితే ముస్లిం సోదరీమణులు బీజేపీని ప్రశంసిస్తే విపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. వారి అభివృద్దిని అడ్డుకునేందుకు హక్కులు, ఆకాంక్షలతో కొత్త మార్గంలో విపక్షాలు వస్తున్నాయని చెప్పారు. 'యూపీ ప్రజలు అభివృద్ధి వైపు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఎవరైతే యూపీని అల్లర్ల రహితంగా, మన తల్లి, కూతుళ్లను భయం లేకుండా ఉంచుతారో, నేరస్తులను జైళ్లో ఉంచేవారికే ఓటు వేస్తారు. కుటుంబ పార్టీలు అన్ని అబద్దపు వాగ్దానాలు చేస్తున్నాయి. వారు ఉచిత విద్యుత్ ప్రకటించినా, అధికారంలోకి వస్తే రాష్ట్రం చీకటిలోకి వెళ్తుంది' అని విపక్షాలపై మోడీ ఆరోపణలు చేశారు. కుటుంబ రాజకీయాలతో నకిలీ సోషలిజాన్ని సమాజ్‌వాదీ పార్టీ ప్రోత్సహిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో చిన్న రైతులు, రోడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల పై దృష్టి పెడుతామన్నారు.

ఓట్ల కోసం బిపిన్ రావత్ పేరు...

ఎన్నికల్లో ఓట్లు సాధించేందుకు కాంగ్రెస్ మాజీ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) బిపిన్ రావత్ పేరు వాడుకుంటున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తరాఖండ్‌లోని శ్రీనగర్‌లో గురువారం 'విజయ్ సంకల్ప్ యాత్ర'లో ఆయన ప్రసంగించారు. 'కాంగ్రెస్ మాజీ సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ పేరును వాడుకుంటూ ఓట్లు పోగు చేస్తుంది. గతంలో ఆయనను సీడీఎస్‌గా నియమించడంపై రాజకీయాలు చేసింది. ఆ పార్టీ నాయకుడొకరు రావత్‌ను వీధి గుండా అని పిలిచారు' అని అన్నారు. ఉత్తరాఖండ్ ప్రజలు నిరంతరం కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు పర్వతాల వలె గుండె ధైర్యం మాత్రమే కాకుండా హిమాలయాల‌ లాగా ఆలోచన శక్తి ఉందని అన్నారు. ఉగ్రస్థావరాలపై సర్జికల్ దాడులు చేసినప్పుడు కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు మరిచిపోరని ఉద్ఘాటించారు. కాగా 70 స్థానాలున్న ఉత్తరాఖండ్‌లో ఈ నెల 14న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story