ఈడీ సమన్లతోనే ఆ పార్టీ మతం వైపు మళ్లింది: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్

by samatah |
ఈడీ సమన్లతోనే ఆ పార్టీ మతం వైపు మళ్లింది: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వరుసగా సమన్లు జారీచేయడంతోనే ఆ పార్టీ మతం వైపు మళ్లిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. బుధవారం ఢిల్లీలో ఆప్ చేపట్టిన ‘సుందర్‌కండ్ పాత్’ పుష్‌ కార్యక్రమాsన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్ ప్రభుత్వం ఢిల్లీలో హిందూ దేవాలయాలు, పూజారులను విస్మరించిందని ఆరోపించారు. అవినీతిపై పోరాడతామని ప్రగల్భాలు పలికిన వ్యక్తులు ఇప్పడు అదే అవీనితి ఊబిలో కూరుకు పోయి జైలు శిక్ష అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈడీ సమన్లను దాటవేసేందుకే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. కాగా, దేశ రాజధానిలోని మొత్తం 70 నియోజకవర్గాల్లో సుందరకాండ పఠనాలు జరిగాయి. మరోవైపు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సైతం ‘సుందర్‌కండ్ పాత్’ కార్యక్రమంపై మండిపడిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ పార్టీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు మధ్య ఎటువంటి తేడా లేదన్నారు.

Advertisement

Next Story