- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: సార్వత్రిక ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్.. దేశవ్యాప్తంగా అమల్లోకి ఎలక్షన్ కోడ్
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం విడుదల చేశారు. శనివారం ఢిల్లీలో సీఈసీ అధికారులు మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికలకు సంధించిన వివరాలు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. జూన్ 16వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని సీఈసీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటు వేసేలా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో 55 లక్షల ఈవీంలు వినియోగిస్తామని పేర్కొన్నారు. 1.25 కోట్ల మంది సిబ్బంది సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనున్నట్లు తెలిపారు.
ఎలాంటి లోపం లేకుండా ఎన్నికలు జరపాలనేదే ఈసీ ప్రయత్నమని స్పష్టం చేశారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయని.. 2024ను ఎన్నికల ఏడాదిగా చెప్పుకోవచ్చన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో ఎన్నికల సౌకర్యాల కల్పన పెద్ద సవాల్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రపంచమంతా భారత ఎన్నికల వైపు చూస్తోందని అన్నారు. భారత ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలను ప్రపంచ గమనిస్తోందన్నారు. ప్రతి ఎన్నిక ఎన్నికల సంఘానికి ఒకే పరక్షేనని.. ప్రతి పరీక్షలో విజయం సాధించాలనేదే తమ లక్ష్యమన్నారు. దేశ పౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఈసీ విజ్ఞప్తి చేసింది. ఎలక్షన్ షెడ్యూల్ కావడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.